మామిడాడ నుండి అప్పన పాలెం వెళ్లే 3 కిలోమీటర్ల బీటీ రోడ్డుకు కోటి 20 లక్షలతో శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
కాకినాడ జిల్లా జగ్గంపేట గత వైసీపీ ప్రభుత్వంలోఅభివృద్ధికి నోచుకోని గ్రామీణ రహదారుల మహర్దశ పట్టిందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట మండలం మామిడాడ నుండి ఏలేశ్వరం మండలం అప్పన పాలెం కు మూడు కిలోమీటర్లు కోటి 20 లక్షల రూపాయలతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నెహ్రూ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మామిడాడ చుట్టుపక్కల ఐదు గ్రామాల ప్రజలు ఏలేశ్వరం వెళ్లేందుకు మామిడాడ నుండి అప్పన్నపాలెం వెళ్లేందుకు మూడు కిలోమీటర్లు పంచాయతీరాజ్ నిధులతో కోటి 20 లక్షల రూపాయలతో తారు రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని అన్నారు. అప్పన పాలెం వద్ద గత వరదల్లో బ్రిడ్జి కూలిపోవడం జరిగిందని రాబోయే రోజుల్లో 10 కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుందని అన్నారు. అంతవరకు ఇర్రిపాక వద్ద ఏలేరు నదిపై తాత్కాలిక వంతెన నిర్మాణం జరిగిందని ప్రజలు ఆ బ్రిడ్జిని ఉపయోగించుకోవచ్చని అన్నారు. రామవరం రాజుపాలెం రోడ్డుకు 14 కోట్లు మంజూరయ్యాయని ఆ నిధులు కాంట్రాక్టర్ తీసుకుని పనిచేయటం లేదని తాత్కాలిక మారాముత్తులకు 28 లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగిందని వారం రోజులనే పనులు పూర్తి మొదలుపెట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి, రేఖ బుల్లి రాజు, మండపాక అప్పన్న దొర, పంచాయతీరాజ్ ప్రాజెక్టు డి ఈ గంగాధర్, గల్లా శ్రీను, ఎంపీటీసీ వేగి చల్లారత్నం రామకృష్ణ, పెంటకోట సత్యనారాయణ, సర్పంచ్ కర్రీ సూర్యకుమారి శ్రీనివాస్, బోదిరెడ్ల సుబ్బారావు, గండే కాశి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పస గొడుగుల బాబురావు, తదితరులు పాల్గొన్నారు.