బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, బెజవాడ బెబ్బులి వంగవీటి మోహన రంగా జయంతి కేశవరం గ్రామంలో ఘనంగా నిర్వహించారు . రంగా జయంతి వేడుకల్లో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్నబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సలాది శివ, అల్లంపల్లి కిశోర్ , కూసు దొరజీ , కుర్ర రవి , ముక్కపాటి రాజు,ముక్కపాటి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.