పి4 పథకంలో నిర్మించేందుకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నిర్ణయం
గండేపల్లి మండలం కే గోపాలపురం గ్రామంలో 1985లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గిరిజనులకు ఐదు సెంట్లు స్థలం 3000 నగదు ఇచ్చి పెంకుల ఇల్లు నిర్మాణం చేయడం జరిగింది. 40 సంవత్సరాలు పూర్తి అవ్వడంతో ఇల్లు శిధిలావస్థకు చేరుకున్నాయి. కే గోపాలపురం గ్రామం నుంచి గిరిజనులు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కలిసి విషయం తెలియజేశారు. ఆయన శుక్రవారం కే గోపాలపురం గ్రామంలో శిధిలావస్థలో ఉన్న ఇల్లు స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజనుల కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇల్లను ప్రభుత్వం పి 4 పథకం లో ఇనప రేకులతో మోడల్ గృహాలుగా నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నానని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఆయన వెంట మండల టిడిపి అధ్యక్షులు పోతుల మోహనరావు, పుష్కర ప్రాజెక్టు కమిటీ చైర్మన్ అడబాల భాస్కరరావు, కే గోపాలపురం మాజీ సర్పంచ్ అవసరాల బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

