రాజమహేంద్రవరం నగర ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోనేరు మురళి కుమారుడు సుష్మంత్ వెంకట్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ బుధవారం రాజమహేంద్రవరంలోని కోనేరు మురళి నివాసానికి వెళ్లి, సుష్మంత్ వెంకట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.తదనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన వెంట కిర్లంపూడి మండల టిడిపి అధ్యక్షుడు చదరం చంటిబాబు, క్లస్టర్ ఇంచార్జ్, మురారి ఉప సర్పంచ్ జాస్తి వసంత్, తొర్రేడు కిషోర్ తదితరులు ఉన్నారు.