01 December 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
Monday, December 1, 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.

గంజాయి డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తి ఫ్రీజ్

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జగ్గంపేట సిఐ వై ఆర్ కె  దర్యాప్తులో బాపిరాజు అక్రమ ఆస్తి బహిర్గతం

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం, ఉప్పలపాడు గ్రామంలో గంజాయి అక్రమ రవాణా ద్వారా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన 0.84 ఎకరాల భూమిని పోలీసులు ఫ్రీజ్ చేశారు.కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ ఆదేశాలు మరియు సూచనల మేరకు పెద్దాపురం ఎస్‌డిపిఒ శ్రీ శ్రీహరి రాజు పర్యవేక్షణలో, జగ్గంపేట సిఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ నేతృత్వంలో ఆర్థిక దర్యాప్తు (Financial Investigation) నిర్వహించారు.2025 మార్చి 4న జగ్గంపేట మండలంలోని జగనన్న కాలనీ వద్ద వనపర్తి బాపిరాజు మరియు ఇతరుల వద్ద నుండి 492.8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు, దీనిపై జగ్గంపేట పోలీస్‌స్టేషన్‌లో Cr. No. 46/2025, NDPS Act 8(c) r/w 20(b)(ii)(c) కింద కేసు నమోదు చేశారు.మార్చి 5న బాపిరాజు సహా ఏడుగురుని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

అక్రమ ఆస్తి వివరాలు

బాపిరాజుకు చట్టబద్ధమైన ఆదాయ వనరులు లేవని దర్యాప్తులో తేలింది.
గంజాయి రవాణా ద్వారా వచ్చిన అక్రమ డబ్బుతో ఉప్పలపాడు గ్రామంలో 0.84 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు నిర్ధారణ అయ్యింది.
ఆస్తి డాక్యుమెంట్ నం. 12930/2024, తేదీ 30.12.2024, SRO జగ్గంపేట.
• సర్వే నం. 210/1, ఉప్పలపాడు గ్రామం.
• విస్తీర్ణం: 0.84 ఎకరాలు.
• ప్రభుత్వ విలువ: ₹10,92,000/-, మార్కెట్ విలువ: సుమారు ₹41 లక్షలు.
• ఈ ఆస్తి అక్రమంగా సంపాదించినది (Illegally Acquired Property – NDPS Act 68B(g)).

ఫ్రీజ్ ఆర్డర్ ధృవీకరణ
• ఇన్‌స్పెక్టర్ వై.ఆర్.కె. శ్రీనివాస్, (ఎంపవర్డ్ ఆఫీసర్ – ఫ్రీజింగ్ & సీజింగ్ ఆఫీసర్) ఈ ఆస్తిని 31.07.2025న ఫ్రీజ్ చేశారు.
అనంతరం ఈ ఫ్రీజ్ ఆర్డర్‌ను 26.08.2025న చెన్నైలోని SAFEM FOP & NDPSA కమిషనర్/కాంపిటెంట్ అథారిటీ ధృవీకరించారు.

 

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo