కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్( ఐపీఎస్ )ఆదేశాలపై ఉక్కుపాదం మోపిన జగ్గంపేట పోలీసుల బృందం
కాకినాడ జిల్లాలో గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలన్న జిల్లా పోలీస్ అధికారి ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జగ్గంపేట పోలీసులు ప్రత్యేక నిఘా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు పెద్దాపురం ఎస్డిపిఓ శ్రీహరి రాజు పర్యవేక్షణలో కీలక ఆపరేషన్ చేపట్టారు.జగ్గంపేట నుండి కాకినాడ వెళ్లే ప్రధాన రహదారిలోని కాట్రావులపల్లి గ్రామ సమీపంలోని ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ వద్ద, స్థానిక పోలీసు బృందం అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అతను జగ్గంపేట మండలానికి చెందిన కే. లోవ రాజు అలియాస్ రాజేష్ అలియాస్ పటేల్ (37), మెరక వీధికి చెందినవాడిగా గుర్తించారు.సందేహంతో అతని వద్ద తనిఖీలు జరపగా 4.38 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ దర్యాప్తును జగ్గంపేట సీఐ వై.ఆర్.కే ఆధ్వర్యంలో ఎస్సై రఘునందన్ రావు మరియు సిబ్బంది విజయవంతంగా నిర్వహించారు.నిందితుడిని అరెస్ట్ చేసి, పెద్దాపురం గౌరవ న్యాయస్థానంలో హాజరు పరచగా, ఆగస్టు 14 -2025 వరకు న్యాయ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అనంతరం అతన్ని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని సమూలం చేయాలనే లక్ష్యంతో నిరంతరంగా చర్యలు తీసుకుంటామని జగ్గంపేట సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ తెలిపారు.