కాకినాడ జిల్లా గండేపల్లి లో భర్త చనిపోయిన భార్యకి కూటమి ప్రభుత్వం స్పౌజ్ పెన్షన్లు అందచేస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు.కాకినాడ జిల్లా గండేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చలగళ్ల దొరబాబు అధ్యక్షతన ఎంపిడివో కర్రి చందర్రావు పర్యవేక్షణలో జరిగిన స్పౌజ్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ముఖ్య అతిధిగా పాల్గొని మండలంలో 168 మంది లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారని,అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి పార్టీలకతీతంగా వృద్ధులకు, వితంతువులకు 4వేల రూపాయలు,వికలాంగులకు 6వేల రూపాయలు,తల సేమియా,కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10 వేల రూపాయలు, సంపూర్ణ వికలాంగులకు 15వేల రూపాయలు పెన్షన్లు ప్రతి నెల ఒకటో తేదీనే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అధికారులు,ప్రజాప్రతినిధులు అందిస్తున్నారని అన్నారు. సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ అని జగన్మోహన్రెడ్డి అనుకోవడం ఆయన భ్రమ అన్నారు.రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి దిశగా నడిపిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తాత్కాలిక సంక్షేమం, శాశ్వత సంక్షేమం అందించేందుకు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కృషి చేస్తారని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్య దొర, ఎస్వీఎస్ అప్పలరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్, పుష్కర ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అడబాల భాస్కర రావు, పోతుల మోహనరావు, పరిమి బాబు, కందుల చిట్టిబాబు, సొసైటీ చైర్మన్ లు కంటిపూడి సత్తిబాబు, పాలకుర్తి ఆదినారాయణ, కందుల కొండయ్య చౌదరి, డి శ్రీను, దాపత్రి సీతారామయ్య, ఎంపీడీవో కర్రీ చంద్ర రావు, ఎమ్మార్వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.