14 October 2025
Tuesday, October 14, 2025

గణేశ్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

ఈ నెల 27వ తేదీన ప్రారంభమయ్యే వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో జగ్గంపేట ,కిర్లంపూడి ,గండేపల్లి మండల గ్రామాల్లో గణేశ్ మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు అనుమతులు తీసుకోవాలని జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ సూచించారు.ఆదివారం నిర్వహించిన విలేకరులతో సమావేశం లో ఆయన మాట్లాడుతూ గణేశ్ మండపాల ఏర్పాటు చేయదలచిన నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతులు పొందాలని చెప్పారు. అనుమతులు పొందడంలో ఎటువంటి చలానాలు చెల్లించవలసిన అవసరం లేదని తెలిపారు. https://ganeshutsav.net లోకి వెళ్లి ఎంట్రీ చేసి, అప్లికేషన్ స్టేటస్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.నాలుగు అడుగులకంటే పెద్ద విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి,మండపాలు రోడ్డు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయాలి. రాత్రివేళ ముగ్గురు వాలంటీర్లు కాపలా ఉండాలి. అగ్ని ప్రమాదాలు, విద్యుత్ లోపాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.జూదం, మత్తు పదార్థాలు, అశ్లీల నృత్యాలు నిషేధం. ఊరేగింపులు నిర్ణీత రూట్‌లో, నిర్ణీత సమయాల్లో శాంతియుతంగా జరగాలి. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వాడరాదు.నిమజ్జనం నిర్ణీత ప్రాంతంలోనే జరగాలని, నీటి ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు తెలిపారు. ఉత్సవాలు క్రమశిక్షణ, సామరస్యం, భక్తి భావంతో జరగాలని సీఐ వై.ఆర్.కె. సూచించారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo