జగ్గంపేట సి.ఐ వై.ఆర్.కె శ్రీనివాస్
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జగ్గంపేట సర్కిల్ పరిధిలో గణేష్ నిమజ్జనం సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ఈ సందర్భంగా జగ్గంపేట సి ఐ వై ఆర్ కె మాట్లాడుతూ జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి పోలీస్ స్టేషన్ల సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి, గణేష్ ఉత్సవాలకు సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన మార్గదర్శకాలు వివరంగా తెలియజేశారు. నిమజ్జన ప్రదేశాల్లో గుంపులు ఎక్కువగా చేరే అవకాశం ఉండడంతో, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాంతి భద్రతలు లోపం లేకుండా డ్యూటీలు నిర్వర్తించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా గణేష్ కమిటీ సభ్యులు, మహిళా పోలీస్ సిబ్బంది, బందోబస్తు డ్యూటీలో ఉన్న సిబ్బందితో సమన్వయం కోసం మూడు పోలీస్ స్టేషన్ల వారీగా ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు రూపొందించారు. ఈ గ్రూపుల ద్వారా ఫీల్డ్ స్థాయిలో ఏవైనా సమస్యలు తలెత్తిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం చేరే అవకాశం ఉందని తెలిపారు.నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, ర్యాలీల నిర్వహణ, శాంతిభద్రతల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అలాగే, మహిళా భద్రతపై సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎక్కడైనా అనుచిత చర్యలు చోటు చేసుకుంటే కఠినంగా వ్యవహరించాలని సూచించారు.సర్కిల్ పరిధిలోని ఎస్సై లు తాము డ్యూటీలో ఉన్న సిబ్బందికి మార్గదర్శకాలు ఇచ్చి, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పనిచేసి గణేష్ నిమజ్జనం విజయవంతంగా జరగేలా చూడాలని చెప్పారు.

