ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
స్థానిక గోకవరం రోడ్డులోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పెద్దాపురం లలిత ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఆర్థిక సహాయంతో నిర్మించిన ఆర్వో ప్లాంట్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం కెమిస్ట్రీ ల్యాబ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి లలిత ఎంటర్ప్రైజెస్ అధినేతలు మట్టే సత్య ప్రసాద్, మట్టె శ్రీనివాస్, లలిత ఎంటర్ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మట్టి ఆదిశంకర్ హాజరై వాటర్ ప్లాంట్ విద్యార్థినిలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా మట్టే శ్రీనివాస్, ఆదిశంకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గురుకుల పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అడగడం జరిగిందని వెంటనే ఏర్పాటు చేశామని ఇంతమంది పిల్లలు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకుంటున్న మీకు ఉన్నత చదువులకు మీకు అన్ని విధాల సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే మట్టే సోదరులు అడిగిన వెంటనే ఈ గురుకుల పాఠశాలకు మంచినీటి సౌకర్యం కల్పించడ మే కాకుండా బాలికల ఉన్నత చదువులు చదువుకోవడానికి సహకరిస్తామని తెలియజేయడం చాలా సంతోషంగా ఉందని వీరు జగ్గంపేటలో డిగ్రీ కళాశాలకు ఆర్వో ప్లాంట్ ఇవ్వడం, కృష్ణవరం గ్రామంలో మరో ప్లాంట్ ప్రజలకు అందించడం జరుగుతుందని, అన్నవరంలో కళ్యాణమండపం ప్రసాదం తయారు చేసే భవనం నిర్మించారని వీరు చేస్తున్న సేవలకు గుర్తించిన ప్రభుత్వం అన్నవరం శాశ్విత బోర్డ్ నెంబర్ గా అవకాశం కూడా కల్పించడానికి సిద్ధమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ లలిత కుమారి, వైస్ ప్రిన్సిపాల్ విజయ క్లారిస్ కుమారి, పాలచర్ల నాగేంద్ర చౌదరి, తిరుమలరాజు మురళి రాజు, బద్ది సురేష్ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.