ప్రభుత్వం గ్రీన్ టాక్స్‌ను రద్దు చేసినందుకు కృతజ్ఞతగా, జగ్గంపేట ఏరియా లారీ ఓనర్స్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం రావులమ్మ నగర్ లో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూకి ఘన సన్మానం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షుడు మారిశెట్టి రాధా, యూనియన్ ప్రెసిడెంట్ ఈశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో లారీ ఓనర్లపై భారీ భారం పడిందని గుర్తుచేశారు. వార్షికంగా రూ.12,000 రెగ్యులర్ టాక్స్, రూ.24,000 గ్రీన్ టాక్స్ కలిపి రూ.36,000 భారం పడిందని, దీని వల్ల లారీ యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.ఈ సమస్యను గుర్తించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర సమయంలో విజయవాడలో లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వైవీ ఈశ్వరరావుతో సమావేశమయ్యారు. గ్రీన్ టాక్స్ రద్దుపై ఆయన అభిప్రాయాన్ని తెలుపగా, ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే దీన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను అనకాపల్లిలో కలిసి ఇదే అంశాన్ని వినిపించగా, ఆయన కూడా కూటమి ప్రభుత్వంలో ఈ సమస్యను పరిష్కరించడానికి హామీ ఇచ్చారని వారు వివరించారు.కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో గ్రీన్ టాక్స్‌ను రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూటమి భాగస్వామి అయిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తో సమావేశమై కృతజ్ఞతలు తెలియజేసినట్టు అసోసియేషన్ నేతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్, మారిశెట్టి భద్రం, పాండ్రంగి రాంబాబు, మారిశెట్టి గణేశ్వరరావు, తిరుమలరాజు మురళి రాజు, సుబ్బరాజు, సుంకర శ్రీనివాసరావు, బుజ్జి, సత్తిబాబు, పులి వెంకటరాజు, మణి రమణ, ప్రతాప్, శివ, హనుమాన్, దుర్గ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.