ఆశీస్సులు అందించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్
జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు రామవరం ఆయన స్వగృహం నందు అభిమానులకు కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు. జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు సోషల్ మీడియా ద్వారా, ఫోన్ ద్వారా, వ్యక్తిగతంగా ఆయనని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రామవరం గ్రామ ప్రజలు పూలమాలలతో ముంచెత్తి భారీ బాణాసంచా కాల్పులతో, జ్ఞాపికలు అందిస్తూ ఆనందోత్సాహాల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి వైభవంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నన్ను ఎప్పుడు తమ కన్న బిడ్డల ఆదరాభిమానాలు చూపిస్తూ ఇంతటి ప్రేమానురాగాలు అందజేస్తున్న రామవరం గ్రామ ప్రజలందరికీ రుణపడి ఉంటానని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాండ్రంగి రాంబాబు, కర్రీ రామచంద్ర రెడ్డి, కింగం రమణ, భూపాలపట్నం ప్రసాద్, కాకినాడ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి బో దిరెడ్ల సుబ్బారావు, కిర్లంపూడి మండలం తెలుగు యువత అధ్యక్షులు గండే కాశీ విశ్వనాథ్, జగ్గంపేట మండల తెలుగు యువత ఉపాధ్యక్షులు బొడ్డేటి సుమన్, అధిక సంఖ్యలో రామవరం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.