మాజీ మంత్రివర్యులు తోట నరసింహం సతీమణి, మెట్ల సత్యనారాయణ కుమార్తె వాణి జన్మదిన వేడుకలు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో గురువారం ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ఆధ్వర్యంలో నిర్వహించారు.
జగ్గంపేట నియోజకవర్గం వ్యాప్తంగా గోకవరం, కిర్లంపూడి, జగ్గంపేట, గండేపల్లి మండలాలకు చెందిన వైసిపి నాయకులు, కార్యకర్తలు పుట్టిన ఊరైన వీరవరం గ్రామంలో ఈ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఇటువంటి వేడుకలు వందేళ్ల పాటు కొనసాగాలని వైసిపి నాయకులు ఆకాంక్షించారు.జన్మదిన వేడుకలకు జగ్గంపేట మండల వైసిపి అధ్యక్షుడు రావుల గణేష్ రాజా, జగ్గంపేట టౌన్ అధ్యక్షుడు కాపవరపు ప్రసాద్, జిల్లా కార్యదర్శి వరుపుల సూరిబాబు, శ్రామిక విభాగం అధ్యక్షురాలు గుర్రం మహాలక్ష్మి, యువత అధ్యక్షుడు నక్కిరెడ్డి విష్ణు చక్రవర్తి పాల్గొన్నారు.