జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్
జగ్గంపేట మండలంలోని గుర్రం పాలెం,రామవరం, రాగంపేట, నీలాద్రి రావు పేట గ్రామాలకు చెందిన నలుగురు యువకులు అల్లరి చిల్లరగా, రిఫ్రాఫ్ గ్యాంగ్‌లా తిరుగుతూ ప్రజలకు అంతరాయం కలిగిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది.ఈ సమాచారం ఆధారంగా జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ సంబంధిత యువకులను అదుపులోకి తీసుకున్నారు. సత్ప్రవర్తనకు ప్రోత్సాహంగా పోలీస్ స్టేషన్ వద్ద కౌన్సిలింగ్ నిర్వహించారు.తదనంతరం వారిని జగ్గంపేట మండల గౌరవ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి, భవిష్యత్తులో ఎలాంటి అల్లరి చర్యలకు పాల్పడకూడదని షరతులతో కూడిన బైండ్ ఓవర్ చేశారు.ఈ సందర్భంగా జగ్గంపేట సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల శాంతిభద్రతలను భంగపరిచే అలజడి చర్యలపై కఠినంగా స్పందిస్తున్నాం. ఎవరికైనా ఒప్పందబద్ధత లేదనుకుంటే, చట్టపరంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.