ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జిల్లా అధ్యక్షుడు నవీన్ పాల్గొనిన తొలి అడుగు కార్యక్రమం
రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, ఇంటింటా తిరిగే ప్రచార కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు విస్తృతంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మరియు కాకినాడ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగూరి నారాయణ, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ నేతృత్వంలో శెట్టిబలిజిపేట ప్రాంతంలో ఇంటింటా తిరిగి ప్రచారం నిర్వహించారు. “తొలి అడుగు” కార్యక్రమం కింద రాష్ట్రంలో ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వారి అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, “కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు. ఒకే ఏడాది కాలంలోనే రాష్ట్రానికి అభివృద్ధి పునాదులు వేసాం. ప్రజల మద్దతుతోనే మరింత వేగంగా ముందుకు సాగుతున్నాం,” అని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, నియోజకవర్గఅభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తున్నాం. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తున్నాం. అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది,” అని వివరించారు.ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి, వాటిని “మై టీడీపీ” యాప్ ద్వారా నమోదు చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు శీలం వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్ కుమార్, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లు అడబాల భాస్కరరావు, బస్వా వీరబాబు, ఉంగరాల రాము, రాష్ట్ర టీడీపీ కార్యదర్శులు ఎస్‌వీఎస్ అప్పలరాజు, కోర్పు లచ్చయ్యదొర, మండల అధ్యక్షులు మారిశెట్టి భద్రం, పోతుల మోహనరావు, చదరం చంటిబాబు, జగ్గంపేట టౌన్ అధ్యక్షుడు పాండ్రంగి రాంబాబు, స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, కూటమి పార్టీకి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.