ముగ్గురు అరెస్ట్
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపిఎస్ జిల్లాలో కమర్షియల్ సెక్స్ వర్క్‌పై పూర్తిస్థాయి కట్టడి విధించాలని, ఎక్కడా ఏ రూపంలోనూ ఇటువంటి కార్యకలాపాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.ఈ ఆదేశాల నేపథ్యంలో జగ్గంపేట శ్రీరామ్‌నగర్ ప్రాంతంలోని ఓ నివాస గృహంలో గుట్టుచప్పుడు కాకుండా కమర్షియల్ సెక్స్ వర్క్ నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం ఆధారంగా, జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్, ఎస్‌ఐ రఘునందన్ రావు, పోలీస్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు.
ఈ దాడిలో ఒక మహిళతో పాటు బ్రోతల్ హౌస్ నిర్వాహకురాలు జి. కాంతమ్మ (గుంటూరు జిల్లా) మరియు ఇద్దరు విటులు అక్కడ పట్టుబడ్డారు. ముగ్గురినీ అదుపులోకి తీసుకుని, బ్రోతల్ హౌస్ ఓనర్ కాంతమ్మ మరియు విటులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బాధిత మహిళకు ఐసిడీఎస్ సిబ్బంది ద్వారా మానసిక పరంగా కౌన్సిలింగ్ అందించి, తరువాత ఆమెను ఆమె బంధువులకు అప్పగించారు.ఈ సందర్భంగా జగ్గంపేట సి ఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో కమర్షియల్ సెక్స్ వర్క్‌కు తావులేని విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.