కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎస్సై రఘునాథరావు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పోలీస్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.జగంపేట హైస్కూల్ వద్ద నుంచి మెయిన్ రోడ్ మీదగా స్థానిక పోలీస్ స్టేషన్ వరకు ఎస్సై రఘునాథరావు తన సిబ్బందితో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై రఘు మాట్లాడుతూ సైక్లింగ్ అత్యంత ఉపయోగకరమన్నారు. ప్రతి ఒక్కరూ సైక్లింగ్ చేయడం ద్వారా ఆరోగ్య భద్రత పొందవచ్చన్నారు.ఇక నుంచి ప్రతి ఆదివారం ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై దృష్టి సారించాలన్నారు.ఆరోగ్య అవగాహనతో పాటు, ప్రజల్లో శారీరక దృఢత్వం, ఫిట్నెస్ ప్రాధాన్యతపై స్పూర్తిని నింపేందుకు ఈ ర్యాలీ చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.

