Tuesday, August 12, 2025
🔔 6
Tuesday, August 12, 2025
🔔 6

జగ్గంపేటలో ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ నిర్మాణం తక్షణమే చేపట్టాలి

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

పి.డి.ఎస్.యు (విజృంభణ) డిమాండ్

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రభుత్వ ఐటిఐ కాలేజ్ నిర్మాణం తక్షణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం నాడు జగ్గంపేట సెంటర్ నుండి స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ,ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి, ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు విజృంభణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడితి సతీష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఐటిఐ కాలేజ్ కొరకు 2018లో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల నెహ్రూ చొరవతో నారా చంద్రబాబునాయుడు రప్పించి పోలవరం కాలువ గట్టుమీద డిగ్రీ కాలేజ్, కాపు కళ్యాణ మండపం, స్టేడియం, క్రిస్టియన్ కళ్యాణమండపం, ఐటిఐ కాలేజీకి శంకుస్థాపనలు చేయించారని ఆయన తెలిపారు. కానీ డిగ్రీ కాలేజ్, కాపు కళ్యాణ మండపం, స్టేడియం, క్రిస్టియన్ కళ్యాణ మండపాలు పూర్తి అయినవి.కాని ఐటిఏ కాలేజ్ నిర్మాణం చేపట్టలేదని ఆయన తెలిపారు.టీడీపీ ప్రభుత్వం మారిన తర్వాత వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ ఈ ఐ టి ఐ కాలేజ్ నిర్మాణం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు .ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అవుతున్న గాని నిర్మాణ పనులు చేపట్టలేదని ఆయన విమర్శించారు.ప్రస్తుతం ఐటిఐ కాలేజ్ స్థానిక ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల ప్రాంగణంలో నడిపిస్తున్నారని అక్కడ చాలీచాలని రూముల్లో, సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతూ విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారని ఆయన తెలిపారు.పోలవరం కాలువ గట్టుమీద అప్పటి కలెక్టర్,ఎమ్మార్వో ఐటిఐ కాలేజీకి నాలుగు ఎకరాల కేటాయించారని, ఆ కేటాయించిన భూమిలో కొంతమంది మట్టి మాఫియా గ్రావెల్ ,మట్టి బయటకు తరలించిపోయారని ఆయన తెలిపారు. సుమారు ఈ కాలేజీ నిర్మాణం కోసం 12 కోట్లు రూపాయల ఎస్టిమేషన్ వేయడం కూడా జరిగిందని ఆయన తెలిపారు. ఇకనైనా కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధి వారు, అలాగే జగ్గంపేటలో ఉంటున్న స్థానికులు ,పెద్దలు స్పందించి ప్రభుత్వ ఐటిఐ కాలేజ్ నిర్మాణం కొరకు చొరవ చూపాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
అలూరి సీతారామరాజు
సినీ వాయిస్
టెక్నాలజీ
సక్సెస్ వాయిస్
తెలంగాణ
తీర్పు వాయిస్
క్రీడా వాయిస్
తూర్పు గోదావరి
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo