జగ్గంపేట పట్టణంలో రిఫ్రాఫ్‌గా తిరుగుతూ పబ్లిక్‌కు న్యూసెన్స్ కలిగిస్తున్న నెహ్రూ కాలనీకి చెందిన జి. వంశి (వయసు 25) మరియు గుర్రంపాలెం గ్రామానికి చెందిన ఎం. గురు దేవ్ (వయసు 32) అనే ఇద్దరిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సమాచారం మేరకు, వీరు గురువారం పట్టణ పరిధిలో అనుచితంగా ప్రవర్తిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగించారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట సర్కిల్ ఆఫీస్ వద్ద సి ఐ వై ఆర్ కె వీరికి కౌన్సిలింగ్ ఇవ్వగా, తదుపరి జగ్గంపేట మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వారి ముందు హాజరుపరచి, సత్ప్రవర్తన కొరకు బౌండ్ ఓవర్ చేయబడినట్టు సమాచారం.ఎవరైనా రోడ్లపై అల్లరి చేసి, రిఫ్రాఫ్‌లా తిరుగుతూ ప్రజలకు న్యూసెన్స్ కలిగిస్తే, వారి పట్ల కఠిన చర్యలు తప్పవని జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ హెచ్చరించారు