స్థానిక పద్మనాభ నగర్ లో జగ్గంపేట సచివాలయం 48.6 లక్షలతో నిర్మాణం చేసిన సచివాలయాన్ని బుధవారం ఉదయం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతులు మీదుగా ప్రారంభించారు.ముందుగా నూతన సచివాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే నెహ్రూకు నాయకులు అధికారు లు ఘనస్వాగతం పలికారు. అనంతరం సచివాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జగ్గంపేటలో సచివాలయం మూడు ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఉద్యోగులను సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం పలు గదులను ఎస్ఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్తకొండ బాబు, జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, సత్తి సదాశివరెడ్డి, పాలచర్ల నాగేంద్ర చౌదరి, వేములకొండ జోగారావు తదితరులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బుర్రి సత్తిబాబు, సర్పంచ్ బచ్చల నాగరత్నం, కాంట్రాక్టర్ పాఠం శెట్టి లక్ష్మణ్ మూర్తి,(బుజ్జి) పంచాయతీరాజ్ డిఇ ఉమా శంకర్, జేఈ నారాయణమూర్తి, ఎండిఓ చంద్రశేఖర్, ఈవోపీఆర్డి భాస్కర్ రావు, పంచాయతీ సెక్రటరీ శివ, సిడిపిఓ పూర్ణిమ నండ్ల చిరంజీవి, రాయి సాయి, నేదురి గణేష్, కింగం రామకృష్ణ, మారిశెట్టి గంగ, రీసు రమణ, సాంబత్తులు చంద్రశేఖర్, కుప్ప తాతారావు, పలివెల ఏసు రాజు, ముక్క పాలు బాబు, అధికారులు, కుటమి నాయకులు పాల్గొన్నారు.