Saturday, August 2, 2025
Saturday, August 2, 2025

జగ్గంపేట అంబేద్కర్ గురుకులంలో విద్యార్థినీలకు భద్రతపై అవగాహన

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

మహిళల రక్షణపై జగ్గంపేట పోలీసుల హామీ

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ సూచనలతో, మహిళల భద్రతకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసు విభాగం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా, విద్యార్థినీల హాస్టళ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా పరికల్పనలతో పాటు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో మంగళవారం జగ్గంపేటలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిలుగా జగ్గంపేట సీఐ వై.ఆర్.కె, ఎస్‌ఐ రఘునందన్ రావు హాజరైనారు. ఈ సందర్భంగా సీఐ వై.ఆర్.కె మాట్లాడుతూ –హాస్టల్లో విద్యార్థినీల మధ్య ర్యాగింగ్ వంటి అనవసరమైన ఘటనలు చోటు చేసుకోకుండా అందరూ సోదరీ భావంతో ఉండాలి. కొత్తగా చేరిన విద్యార్థినీలను బంధువుల్లా చూసుకోవాలి. ఎలాంటి భయం లేకుండా, స్వేచ్ఛగా, నిబద్ధతతో చదువుకోవడానికి అవసరమైన రక్షణను పోలీసులు నిరంతరం కల్పిస్తారు” అని చెప్పారు.పోలీసులు 24 గంటలు విద్యార్థినీలకు అందుబాటులో ఉంటారని తెలియజేస్తూ, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో 9440796529, 9440796569 నెంబర్లకు గానీ, 100 నెంబర్‌కు గానీ సంప్రదించాలని సూచించారు.అంతేకాక, అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు తక్షణ రక్షణ అందించే ‘శక్తి’ మొబైల్ యాప్ ఉపయోగాలపై విద్యార్థినీలకు వివరించారు. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని, అత్యవసర సమయంలో ఉపయోగించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమం విద్యార్థినీలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, వారి భద్రతపై పోలీసుల వంతైన బాధ్యతను స్పష్టంగా చూపించిందని తెలుస్తుంది. ఈ కార్యక్రమం ల్ పాఠశాల ప్రిన్సిపాల్ డా. జి.వి. లలిత కుమారి, వైస్ ప్రిన్సిపాల్ బివిసి కుమారి,ఉపాధ్యాయులు రజిని, అమృతవల్లి, ఉషారాణి, సత్యవతి, తులసి, సూర్యావతి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo