జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన చారిత్రక చిత్రం హరిహర వీరమల్లు ట్రైలర్‌ను బుధవారం జగ్గంపేట నాగేశ్వర థియేటర్‌లో ఘనంగా విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన జగ్గంపేట ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ప్రొజెక్టర్ స్విచ్ ఆన్ చేసి ట్రైలర్‌ను విడుదల చేసిన అనంతరం, పవన్ కళ్యాణ్ కటౌట్‌కి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, “హరిహర వీరమల్లు ట్రైలర్ అద్భుతంగా ఉందని, చరిత్రను ఆధారంగా చేసుకున్న చిత్రాలు సమాజానికి అవసరమని” అన్నారు. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో శ్రీ వీరాంజనేయ పిల్మ్స్ సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా పాల్గొన్నారు. బాణాసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు.