స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జగంపేట శాసనసభ్యులు, టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీని ప్రకటించారు. ఈ అభివృద్ధి కమిటీకి చైర్మన్ గా జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, సభ్యులుగా ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్ర రావు, కుంచే రాజా, కందుల చిట్టిబాబు, కోర్పు సాయి తేజ, జంపన సీతారామచంద్ర వర్మ, చదరం గోవిందరాజులు (చంటిబాబు) కంచుమర్తి రాఘవ, హలో నిన్ ప్రశాంత్ కుమార్ (కన్నబాబు), జనపరెడ్డి సుబ్బారావు (కొత్తపల్లి బాబు) బత్తుల సత్తిబాబు తదితరులు నియమించినట్టు ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల ను అభివృద్ధి కమిటీ పర్యవేక్షణలో జరుగుతాయని జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, గోకవరం మండలాల నుంచి ఈ కమిటీలో సభ్యులను వేయడం జరిగిందని అన్నారు.