కాకినాడ జిల్లాలో ఎటువంటి జూదక్రీడలు మరియు అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట సర్కిల్‌లో పోలీస్ విభాగం విజిలెంట్‌గా వ్యవహరిస్తోంది.ఆదేశాల ప్రకారం ఆదివారం జగ్గంపేట ఎస్‌ఐ రఘునందన్ రావు తన సిబ్బందితో కలిసి అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగం గా జగ్గంపేట బాలాజీ నగర్ ,టౌన్ హాల్ , కాకినాడ రోడ్ లో ఉన్న జగ్గంపేట ఎస్సార్ పెట్రోల్ బంక్ ,రాజపూడి రైస్ మిల్ వెనుక ఉన్న పామ్ ఆయిల్ తోట లో కీలక ప్రాంతాల్లో నిఘా పెంచి, స్థానిక సమాచారం ఆధారంగా తనిఖీలను చేపట్టారు.జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఎవరైనా గుండాట, పేకాట, బొమ్మా బొరుసు, కోడి పందాలు, ఎత్తులాట, కోతా బంతి, క్రికెట్ బెట్టింగులు వంటి జూదక్రీడలు నిర్వహించినా లేదా బ్రోతల్ హౌస్‌లను నడిపించినా వారిపై కఠిన చర్యలు తప్పవనిస్పష్టం చేశారు.అలాంటి కార్యకలాపాలను గమనించినవారు వెంటనే జగ్గంపేట సి ఐ నంబర్ 94407 96529 లేదా ఎమర్జెన్సీ నంబర్లు 100 లేదా 112కు సమాచారం అందించాలని కోరారు. కాకినాడ జిల్లా పోలీస్ వాట్సాప్ నంబర్ 94949 33233కి కూడా సమాచారం ఇవ్వవచ్చు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని ఉపేక్షించబోమని, చట్టపరమైన చర్యలు తప్పవని జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ హెచ్చరించారు