ప్రభుత్వ ఐటిఐ జగ్గంపేటలో 2025-26 విద్యాసంవత్సరం మిగిలిన సీట్ల భర్తీకి మూడవ విడత ప్రవేశ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎల్.ఆర్.ఆర్. కృష్ణన్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఐటిఐ జగ్గంపేటలో ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, సివిల్ ట్రేడ్స్‌లో సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అభ్యర్థులు షెడ్యూల్ ప్రకారం 26-08-2025 సాయంత్రం 5.00 గంటలలోపు iti.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.దరఖాస్తు చేసినవారు ఆ ప్రింట్ కాపీతో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్లు, జతపరచిన ప్రతులు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో జగ్గంపేట ప్రభుత్వ ఐటిఐలో వెరిఫికేషన్ చేయించుకోవాలని ప్రిన్సిపాల్ తెలిపారు. వెరిఫికేషన్ చేయని అభ్యర్థుల దరఖాస్తులు చెల్లవని స్పష్టం చేశారు.వివరాల కోసం 9440262266, 8142345444 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. ముఖ్యంగా ఆన్లైన్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులంతా కౌన్సెలింగ్‌కు తప్పనిసరిగా హాజరుకావాలని ప్రిన్సిపాల్ సూచించారు.