14 October 2025
Tuesday, October 14, 2025

జగ్గంపేట భాష్యం స్కూల్లో ఘనంగా తెలుగు భాష మరియు జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

జగ్గంపేట రావులమ్మ నగర్ లోని గల భాష్యం పాఠశాలలో తెలుగు భాష దినోత్సవం మరియు జాతీయ క్రీడ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటగా గిడుగు రామ్మూర్తి పంతులు మరియు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కుసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు. దేశంలో 22 అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో తెలుగు ఒకటన్నారు. హిందీ, బెంగాలీ భాషల తర్వాత దేశంలో ఎక్కువగా మాట్లాడుకునే భాష తెలుగు అని తెలియజేశారు. తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 29వ తేదీన తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. భారత హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ గౌరవ సూచికంగా ఆయన పుట్టినరోజు అయిన ఆగస్టు 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవం గా జరుపుకుంటున్నామన్నారు. ఒలింపిక్స్ క్రీడల్లో మన దేశానికి మూడు బంగారు పథకాలు అందించిన గొప్ప క్రీడాకారుడు అన్నారు. మనదేశంలో హాకీ క్రీడకు ఆద్యుడుగా ధ్యాన్ చంద్ ను అభివర్ణిస్తుంటారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, జోనల్ ఇన్చార్జ్ గోవిందరాజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ ప్రిన్సిపాల్ వాణి, తెలుగు ఉపాధ్యాయులు బాలాజీ రావు,రేవతి, వ్యాయామ ఉపాధ్యాయులు రవినాగ్ పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo