స్థానిక రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట మండలం అనుబంధ విభాగాల కమిటీల ఏర్పాటు గండేపల్లి మండల వైస్ ఎంపీపీ కుంచే రాజా పరిశీలకలుగా తెలుగుదేశం పార్టీ 11 అనుబంధ కమిటీలను ఏర్పాటు చేశారు. తెలుగు యువత అధ్యక్షుడిగా రాయి సాయి, తెలుగు మహిళ అధ్యక్షురాలుగా నకిరేడ్డి సూర్యావతి, తెలుగు రైతు అధ్యక్షుడిగా దాట్ల సూరిబాబు రాజు, బీసీ సెల్ అధ్యక్షుడిగా నంగన శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా సాంబర్ల చంద్రశేఖర్, మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా షేక్ బాషా, ఐ టిడిపి అధ్యక్షుడిగా కూసి మంచి బాలరాజు, క్రిస్టియన్ విభాగం అధ్యక్షుడిగా వేయి రామకృష్ణ, వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా మానేపల్లి సాయి, డాక్టర్స్ విభాగం అధ్యక్షుడిగా తిరుపతి మారుతి, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా మాగాపు శ్రీను, ఎస్ టి సెల్ అధ్యక్షుడిగా మానేపల్లి సుబ్రహ్మణ్యంను నియమించారు. ఈ సందర్భంగా పరిశీలకులు కుంచే రాజా మాట్లాడుతూ జగ్గంపేట మండలంలోని 11 అనుబంధ విభాగాల పూర్తిస్థాయిలో కమిటీని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి అందజేశాం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు జీను మణిబాబు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, సొసైటీ చైర్మన్లు బుర్రి సత్తిబాబు, ఉప్పలపాటి వెంకటేశ్వరరావు, రేఖ బుల్లి రాజు, ముసిరెడ్డి నాగేశ్వరరావు, బస్వా చినబాబు, సర్వసిద్ధి లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.