కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక జెవిఆర్ అపార్ట్మెంట్ లో జగ్గంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీను మణిబాబుని జగ్గంపేటశ్రీ రావులమ్మ తల్లి తోపుడుబండ్ల చిన్న వర్తకుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వానశెట్టి తాతాజీ, సెక్రెటరీ బొడ్డు కొండ వెంకటరమణ ఆధ్వర్యంలో మర్యాదపూర్వంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా అభిమాన నాయకుడు జీను మణి బాబు మండల టిడిపి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా ఆయనను మర్యాదపూర్వంగా కలిశామని అన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం అధ్యక్షులు తాతాజీ మాట్లాడుతూ 132 మంది సెంటర్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నామని మాలో ఇల్లు లేని వారికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారి సహకారంతో మా అందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించాలని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీను మణిబాబుని కోరమని అన్నారు. మణిబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ సాకారంతో మీ అందరి సమస్యలను పరిష్కరించి మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రావులమ్మ తల్లి తోపుడుబండ్ల చిన్న వర్తకుల సంక్షేమ సంఘం సభ్యులందరూ పాల్గొన్నారు.