ముఖ్య అతిథిగా పెద్దాపురం ఎస్ డి పి వో శ్రీహరి రాజు
కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఉన్న గ్రౌండ్ లో పోలీస్ సిబ్బంది శారీరక సామర్థ్యాన్ని పెంపొందించడముతో పాటు, విధుల నిర్వహణలో నిపుణత సాధించే దిశగా, జగ్గంపేట పోలీస్ సర్కిల్ సిబ్బందికి ప్రత్యేకంగా డ్రిల్ మరియు ఇన్స్ట్రక్షన్ క్లాస్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వై ఆర్ కె శ్రీనివాస్ నేతృత్వం వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దాపురం SDPO శ్రీ హరి రాజు మాట్లాడుతూ, పోలీస్ వ్యవస్థలో శిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ప్రతి పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు. అలాగే, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, తాజా పరిణామాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.జగ్గంపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వై ఆర్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ తరహా శిక్షణలు పోలీస్ సిబ్బంది సేవా ధోరణిని మరింత మెరుగుపరుస్తాయని, ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎస్సై టీ.రఘునాదారరావు,హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.