ముగ్గురు పేకాట రాయుళ్లు అరెస్ట్
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్(ఐ.పి.ఎస్ )జిల్లా వ్యాప్తంగా జూదక్రీడలపై ఉక్కుపాదం మోపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఆ ఆదేశాల మేరకు, జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. కు అందిన విశ్వసనీయ సమాచారంతో, ఎస్‌ఐ శ్రఘునందన్ రావు మరియు సిబ్బందితో కలిసి కాట్రావులపల్లి గ్రామ శివారులో గరువు చెరువు ప్రాంతంలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులపై ఆకస్మిక దాడి నిర్వహించారు. దాడిలో ముగ్గురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ. 5,150/- నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.అదే విధంగా, జగ్గంపేట శివారులోని స్మశానవాటిక వద్ద, చట్టానికి విరుద్ధంగా మద్యం దాచిన వ్యక్తిపై చర్యలు తీసుకున్నారు. చైల్డ్ ఇన్ కాన్‌ఫ్లిక్ట్ విత్ లా (CICL) కింద ఉన్న ఒక నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి 1.640 లీటర్ల మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఎవ్వరైనా జూదక్రీడలు లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు సమాచారం ఉంటే, ప్రజలు సమాచారం అందించాలని జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ కోరుతున్నారు.
సంప్రదించవలసిన నెంబర్లు:
📞 జగ్గంపేట సి ఐ : 94407 96529
📞 పోలీసు కంట్రోల్ రూమ్: 100 / 112
📞 కాకినాడ జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్: 94949 3323