కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జెడ్ రాగం పేటలో ఎల్ వన్ డిస్క్ సమస్యతో మంచానికి పరిమితమైన దివ్యాంగురాలు కొమ్మలపల్లి నాగవల్లి ఇంటికి వెళ్లి 15వేల రూపాయలు పెన్షన్ జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండల సభ్యులు జ్యోతుల నెహ్రూ అందజేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ ను ప్రభుత్వం 3000 నుండి రూ 4 వేలకు పెంచి అమలు చేస్తోంది. అన్ని కేటగిరీల పెన్షన్లు పెంచింది అని 3000 రూపాయలు ఉన్న దివ్యంగుల పెన్షన్ 6000, కిడ్నీ బాధితులకు పదివేల రూపాయలు, మంచానికే పరిమితమైన దివ్యాంగులకు పదివేల రూపాయలు అందజేస్తున్నామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ప్రతీ నెలా ఒకటో తేదీనే ఇంటి వద్ద కు వెళ్లి పెన్షన్ అందిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రతీ నెలా ఒకటో తేదీన వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసేది. కూటమి ప్రభుత్వం వాలంటీర్ల స్థానంలో సచివాలయ సిబ్బందితోనే ప్రతీ ఇంటికి ఒకటో తేదీనే అందేలా అమలు చేస్తోంది అని ఏ కారణం చేతనైనా ఒకటో తేదీ సెలవు వస్తే ముందు రోజే పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతీ నెలా ఒకటో తేదీన సీఎం చంద్రబాబు సహా, మంత్రు లు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.ఈ నెలలో భర్తలు చనిపోయిన వారికి వారి స్థానంలో అందించే పెన్షన్ శాంక్షన్ అయిందని రేపు వాటిని పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే నెహ్రూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్ రాగంపేట సర్పంచ్ కందుల చిట్టిబాబు, రాగంపేట సొసైటీ చైర్మన్ కందుల కొండయ్య చౌదరి (బాబ్జి) టిడిపి యువనేత పాలచర్ల నాగేంద్ర చౌదరి, కంటే సురేంద్ర ఉండవల్లి వరప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.