కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జె.కొత్తూరు గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ కనక దుర్గ అమ్మవారు శ్రావణ శుద్ధ వరలక్ష్మి వ్రతము సందర్భంగా అమ్మ వారికి సుమారు ఐదు లక్షల యాభై వేల రూపాయల విలువ గల బంగారు హారం (బంగారు ఆభరణం) బహుకరించారు. ఆలయ భక్తులు ఇచ్చినటువంటి బంగారు వస్తువులు అన్ని కలిపి బంగారు హారం శ్రావణ శుద్ధ వరలక్ష్మి వ్రతము రోజు అమ్మవారికి బహుకరించడం విశేషం. కోరిన కోరికలు సిద్ధించే అమ్మవారిగా ప్రసిద్ధి చెందిన జే కొత్తూరు దుర్గమ్మ అమ్మవారికి నిత్యం వందలాదిగా భక్తులు వచ్చి దర్శించుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమం లో ఆలయ ధర్మకర్తలు, ఆలయ చైర్మన్ మరియు ఆలయ కమిటి సభ్యులు, గుడి పాట దారులు, గ్రామ పెద్దలు మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.