భూపాలపట్నం ప్రసాద్ కుమారుడు వెంకట రాకేష్
స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ కు 2 లక్షల రూపాయలు చెక్కును విరాళంగా భూపాలపట్నం ప్రసాద్ కుమారుడు వెంకట రాకేష్ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కు అందజేశారు. ఈ సందర్భంగా వెంకట రాకేష్ మాట్లాడుతూ నేను చార్టెడ్ అకౌంట్ గా ఉద్యోగం సాధించిన నేపథ్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ కు 2 లక్షల రూపాయలు విరాళం అందిస్తున్నానని ఈ సందర్భంగా చైర్మన్ జ్యోతుల మణి కి కృతజ్ఞతా వందనాలు తెలియజేేేసుకుంటున్నానని తెలిపారు .ఈ కార్యక్రమంలో వీరారెడ్డి కాశిబాబు, తోట రవి, తోట గాంధీ, భూపాలపట్నం భూపాలపట్నం ప్రసాద్, ప్రియతమ్ తేజ తదితరులు పాల్గొన్నారు.