స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ కు 30000 విరాళం అందించిన రిటైర్డ్ డిప్యూటీ ఎంపీడీవో ఎం సూర్య భాస్కర్ రావు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా చెక్కును అందించారు. ఈ సందర్భంగా సూర్య భాస్కర్ రావు మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా జగ్గంపేట నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈ సంస్థకే నేను పదవి విరమణ పొందిన నేపథ్యంలో ఈ చిరు విరాళం అందించానని అన్నారు. అనంతరం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా సత్కారం అందుకున్నారు. పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, బుర్రి సత్తిబాబు, దేవరపల్లి మూర్తి, ఎంపీడీవో చంద్రశేఖర్, జగ్గంపేట సెక్రెటరీ శివ, వేములకొండ జోగారావు, నకిరేడ్డి సూర్యవతి తదితరులు పాల్గొన్నారు.