దర్శించుకున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
విఘ్నాలను తొలగించి, ఐశ్వర్యం, ఆనందం, సంతోషం ప్రసాదించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సౌభాగ్యం విరాజిల్లాలని ఆకాంక్షిస్తూ జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మనవడు కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ తనయుడు అనీష్ నెహ్రూ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కేఎల్ఎం షాపింగ్ మాల్ పక్కన లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ నవరాత్రి మహోత్సవాలకు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ సతీమణి లక్ష్మీదేవి హాజరై విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, భూపాలపట్నం ప్రసాద్, పాలచర్ల నాగేంద్ర చౌదరి, పీల మహేష్, బో దిరెడ్ల సుబ్బారావు, మండపాక అప్పన్న దొర, బద్ది సురేష్, బొడ్డేటి సుమన్, అడపా తాతాజీ, అడపా అబ్బాయి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

