13 October 2025
Monday, October 13, 2025

మిథున్ రెడ్డి అరెస్టు అక్రమం..

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జక్కంపూడి రాజా దీక్ష భగ్నం దారుణం..

– ఇసుక దోపిడీ ఏ రకంగా చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారు

– కూటమి పాలనపై విరుచుకుపడ్డ వైసిపి బిసి నాయకుడు బూడిద శరత్ కుమార్

విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం

రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్:  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి అరెస్టు అక్రమమని ఆంధ్ర రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సీనియర్ నాయకుడు బూడిద శరత్ కుమార్ విమర్శించారు.ఢిల్లీలోని ఆంధ్ర భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో మద్యం ఏరులై పారుతోందని ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అందుకే మద్యం స్కామ్ పేరుతొ మిథున్ రెడ్డిని అన్యాయంగా అరెస్టు చేసారని విమర్శించారు.ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో నిరసన పెల్లుబికుతోందని, ఇక ఎవరూ ప్రశ్నించకూడదన్న ఉద్దేశ్యంతో మిథున్ రెడ్దని అరెస్ట్ చేసి, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని శరత్ కుమార్ విమర్శించారు.

మరోపక్క పేపర్ మిల్లు కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై యువనాయకుడు జక్కంపూడి రాజా తలపెట్టిన దీక్షను భగ్నం చేయడం దారుణమని శరత్ కుమార్ అన్నారు.500మంది పోలీసులను మోహరించి దీక్షను అడ్డుకోవడం శోచనీయమన్నారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఇక్కడికక్కడ రాత్రికి రాత్రే ఇసుక ను స్టాక్ పాయింట్లనుంచి తరలించేశారని,అది చాలక గోదావరికి తూట్లు పొడుస్తూ ఇసుకను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.2029లో ప్రజలు మళ్ళీ జగన్ ని అధికారంలోకి తీసుకువస్తారని, అప్పుడు 2. 0పాలన ఎలా ఉంటుందో చూస్తారని ఆయన అన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo