13 October 2025
Monday, October 13, 2025

టీటీడీ వి ఐ పి టికెట్ల మోసం బట్టబయలు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

నిందితుడుని అరెస్ట్ చేసిన జగ్గంపేట పోలీసులు

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

తిరుమల తిరుపతి దేవస్థానం (టీ టీ డి )వి‌ఐ‌పి దర్శన టికెట్లు ఇప్పిస్తానని నమ్మబలికి ప్రజలను మోసం చేస్తున్న ఒక వ్యక్తిని జగ్గంపేట పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసుల వివరాల ప్రకారం, జూలై 10న జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ వ్యక్తిగత సహాయకుడు (PA) డి. శివ ప్రసాద్‌కు, వంశీ పేరుతో ఒక వ్యక్తి ఫోన్ చేసి, “నేను ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. వి‌ఐ‌పి దర్శనం, సేవా టికెట్లు ఇప్పిస్తాను. ఇందుకోసం ₹50,000 ఖర్చు అవుతుంది” అని చెప్పాడు. అలాగే ఆధార్ కార్డు వివరాలు పంపాలని కోరాడు.అతని మాటల్లో అనుమానం గమనించిన పీఏ వెంటనే ఎమ్మెల్యేకు సమాచారం అందించగా, జగ్గంపేట పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 228/2025 కింద U/S 318(2), 319(2), 318(4) BNS, 66-D IT యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు.ఈ కేసును కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి, కిర్లంపూడి ఎస్సై జి. సతీష్, జగ్గంపేట సి‌ఐ రైటర్ కృపారావు, పోలీస్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు.సాంకేతిక ఆధారాలను సేకరించి, నిందితుడు కోనసీమ జిల్లా గుడిమూలం గ్రామానికి చెందిన జి. రాజకుమార్ అలియాస్ ఆర్‌కే అలియాస్ విజయ్ కుమార్ అలియాస్ వంశీ (37) అని గుర్తించారు. ప్రస్తుతానికి గోవాలో నివసిస్తున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.2020–2024 మధ్య సూర్యాపేట, తణుకు, కృష్ణలంక, పాలకొల్లు, నర్సాపురం, ఎల్‌బీ నగర్ తదితర ప్రాంతాల్లో ఈ నిందితుడిపై పలు మోస కేసులు నమోదై ఉన్నాయి. సోషల్ మీడియా, గూగుల్ సెర్చ్ ద్వారా వ్యాపారులు, వ్యక్తుల వివరాలు సేకరించి, తాను ప్రముఖుల పీఏనని పరిచయం చేసుకొని, వి‌ఐ‌పి టికెట్లు ఇప్పిస్తానని నమ్మబలికి డబ్బులు వసూలు చేయడం ఇతని తరహా.ఇటీవల గోకవరం ప్రాంతంలోని ఒక బంగారు దుకాణ యజమాని దగ్గర కూడా ఇదే పద్ధతిలో మోసం చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు అలానే నిందితుడికి 14 రోజులు రిమాండ్ (26/08/2025 )విధిస్తూ పెద్దాపురం సబ్ జైల్ కి తరలించడం జరిగిందని జగ్గంపేట సి‌ఐ వై.ఆర్.కే. శ్రీనివాస్ వెల్లడించారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo