జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ లో అన్నదానం
జనసేన అధినేత , ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో, జగ్గంపేట పట్టణంలో ఓ మహత్తర సేవా కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతోంది. స్థానిక పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రతి మంగళవారం నిర్వహించబడుతున్న డొక్కా సీతమ్మ క్యాంటీన్అన్నదాన కార్యక్రమం ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది.ఈ క్యాంటీన్ ను జగ్గంపేట జనసేన ఇంచార్జ్ మరియు తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మలపల్లి రమేష్ తన స్వంత ఖర్చులతో నిర్వహిస్తున్నారు. మంగళవారం జరిగిన అన్నదానం కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పేదలకు ప్రేమతో అన్నం వడ్డించారు.ఈ సందర్భంగా జగ్గంపేట జనసేన నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల అనంతరం నుండి విరామం లేకుండా ప్రతి మంగళవారం డొక్కా సీతమ్మ క్యాంటీన్‌ను నిర్వహించడం జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ సేవా మానసికతకు నిదర్శనం. ఇది పవన్ కళ్యాణ్ ప్రజా సేవా దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది” అని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి పేదవాడి ఆకలి తీరే వరకు ఈ సేవా కార్యక్రమం ఆగదని ఇదే నిజమైన ప్రజా సేవకు నిదర్శనం అని తెలిపారు .ఈ కార్యక్రమంలో మాధరపు వీరబాబు, కురుమల్ల నాగేశ్వరరావు, బుద్ధిరెడ్డి శ్రీనివాస్, సత్తి సోమరాజు, గంధం శ్రీను, మొగిలి గంగాధర్, అడబాల వీరబాబు, మండపాక శ్రీరామ్, శ్రీమన్నారాయణ, డ్రిల్ మాస్టారు, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.