14 October 2025
Tuesday, October 14, 2025

డీఎస్సీలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ విద్యార్థిని దేవిశెట్టి దివ్య ప్రభ ప్రతిభ

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

92.04 మార్కులతో ఉత్తీర్ణత

సత్కరించి అభినందించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ మెగా డీఎస్సీ కోచింగ్ తీసుకుని డీఎస్సీ ఫలితాలలో92.04 మార్కులతో ప్రతిభ క నపరిచిన దేవిశెట్టి దివ్య ప్రభను ఘనంగా సత్కరించి అభినందించి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆశీస్సులు అందజేశారు .ఈ సందర్భంగా దివ్య ప్రభ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులమైన మాకు గోకవరం మండలంలో నిర్వాసితులుగా ఉంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో జగ్గంపేట వచ్చినప్పుడు ఒక అమ్మాయి పెన్ను అందించి మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పెన్నుతో మెగాడీఎస్సి పై మొట్ట మొదటి సారి పెట్టాలని కోరడం జరిగిందని అందులో భాగంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం గా మెగా డీఎస్సీ పై పెట్టడం జరిగిందని, ఇదే అవకాశంగా డీఎస్సీలో ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరికతో ఆశగా ఎదురుచూస్తున్న నాకు సోషల్ మీడియాలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా మెగా డీఎస్సీ కి కోచింగ్ అందిస్తున్నారని తెలిసి అందులో చేరడం జరిగిందని, ఉభయ రాష్ట్రాల్లోని కార్పొరేట్ పేకాలిటీ, అనుభవజ్ఞులైన అధ్యాపకులను తీసుకొచ్చి అత్యుత్తమ కోచింగ్ అందించడమే కాకుండా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా,టీచర్ ఎలిజిబిలిటీ టెట్, డీఎస్సీ మెటీరియల్ తోపాటు ఉచిత భోజనం వసతి కల్పించడం , ఇబ్బందులు లేకుండా బస్సు షెల్టర్ నిర్మించడం, ప్రతిరోజు ప్రైవేట్ క్లాసులు చెప్పించి మళ్లీ ప్రైవేటు బస్సులలో మా గమ్యస్థానాలకు చేర్చడం మే కాకుండా జ్యోతులనెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మణిమ్మ వచ్చి మా యోగక్షేమాలు, వసతులతో పాటు మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారని అదేవిధంగా జ్యోతుల నవీన్ కుమార్ కూడా నిరంతరం మాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మాకు ఏమేమి కావాలో అవన్నీ సమకూర్చే వారిని ,ఈరోజు ఈ డీఎస్సీలో ఇన్ని మార్కులు సాధించానంటే అది ఒక జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ అందించిన కోచింగ్ వల్లే సాధ్యమైందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండ బాబు, కందుల చిట్టిబాబు, కంటే ఉదయభాస్కర్, తోలేటి సూర్యనారాయణ, నీలం చక్రధర్ రావు , పడాల బాలాజీ , ముమ్మిడివరపు సురేష్, గద్దే మారుతి , పుర్రె సూరన్న తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo