రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా త్రాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్, (ఐపీఎస్)ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం కిర్లంపూడి పోలీసులు డ్రంకన్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి ఏడుగురు వ్యక్తులను పట్టుకున్నారు. వీరిని గౌరవ పత్తిపాడు కోర్టు ఎదుట హాజరుపరిచారు.
కేసును పరిశీలించిన గౌరవ న్యాయస్థానం నలుగురు వ్యక్తులకు మూడురోజుల పాటు జైలు శిక్షను విధించింది. మిగిలిన ముగ్గురికి రూ. 10,000 చొప్పున మొత్తం రూ. 30,000 జరిమానా విధించింది.ఈ సందర్భంగా జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, “తాగి వాహనాలు నడిపే వారి పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు అని అలాగే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.