తామరాడ ప్రభుత్వ పాఠశాల వద్ద పర్యవేక్షణ
కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఐపీఎస్., ఆదేశాల మేరకు, జగ్గంపేట సర్కిల్ పరిధిలోని పాఠశాలలు, ప్రైవేట్ కళాశాలల వద్ద ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ వంటి సంఘటనలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా చర్యలు చేపడుతున్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సమయాలలో డ్రోన్ కెమెరాలు, పెట్రోలింగ్ ద్వారా విద్యాసంస్థల పరిసరాలను సమీక్షిస్తున్నారు.ఈ చర్యల భాగంగా శుక్రవారం తామరాడ గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్ మరియు జూనియర్ కాలేజీ వద్ద డ్రోన్‌లతో పర్యవేక్షణ నిర్వహించారు. అనుమానితుల కదలికలను గుర్తించడమే కాక, విద్యార్థుల్లో భద్రతా భావాన్ని పెంపొందించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యమని పోలీసులు తెలిపారు.పాఠశాల పరిసరాల్లో 100 గజాల పరిధిలో ఉన్న షాపుల్లో సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను కూడా అధికారులు పరిశీలించారు. మత్తుపదార్థాల దొరికిన దుకాణదారులపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.పిల్లలు భద్రంగా విద్యనభ్యసించేందుకు ఇది మాకు బాధ్యత. డ్రోన్ పర్యవేక్షణ వల్ల తక్షణ చర్యలకూ అవకాశం ఉంటుంది,” అని సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.ఈ ప్రత్యేక నిఘా కార్యక్రమంలో జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. మరియు గండేపల్లి ఎస్‌ఐ శివ నాగబాబు పాల్గొన్నారు.