Sunday, August 3, 2025
Sunday, August 3, 2025

డ్రోన్ల నిఘాతో ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ కు చెక్ – విద్యా సంస్థల వద్ద ప్రత్యేక చర్యలు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జగ్గంపేట సి ఐ వై ఆర్ కే శ్రీనివాస్

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా పోలీస్ శాఖ విద్యార్థుల భద్రత పట్ల మరింత అప్రమత్తంగా ఉంది. విద్యా సంస్థల వద్ద ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ లాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు జగ్గంపేట సర్కిల్ పరిధిలో ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు డ్రోన్ల సహాయంతో పాఠశాలలు, కళాశాలల వద్ద జగ్గంపేట సి ఐ వై ఆర్ కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు.ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సమయాల్లో పాఠశాలలు, ప్రైవేట్ కళాశాలల వద్ద డ్రోన్ల ద్వారా నిఘా కొనసాగుతోంది. డ్రోన్ కెమెరాల సాయంతో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు, విద్యార్థినులలో భద్రతాభావాన్ని పెంపొందించడంతో పాటు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా నియంత్రించడం పోలీసుల ప్రధాన లక్ష్యంగా మారింది.గురువారం కిర్లంపూడి మండలం బూరుగుపూడి హై స్కూల్ వద్ద డ్రోన్ కెమెరా సాయంతో పరిసరాల పర్యవేక్షణ జరిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని జగ్గంపేట సర్కిల్ పోలీసులు తెలిపారు.
విద్యార్థుల భద్రతకు పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు – డ్రోన్లతో నిఘా పటిష్టం” అని వారు స్పష్టం చేశారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo