శివారు ప్రాంతాల్లో పెట్రోలింగ్, అనుమానాస్పద ప్రదేశాలపై కళ్లెం.. జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గ్రామ శివారు ప్రాంతాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగే అనుమానిత ప్రదేశాల్లో డ్రోన్ కెమెరాల సహాయంతో నిఘా, పెట్రోలింగ్‌ను జగ్గంపేట పోలీసులు కట్టుదిట్టం చేశారు.ఈ సందర్భంగా సిఐ వై ఆర్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ శుక్రవారం జగ్గంపేట గ్రామ శివారు పుష్కర కాలవ గట్టు ప్రాంతం, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వెనుకభాగంలో డ్రోన్ పర్యవేక్షణ చేపట్టారు. డ్రోన్ సాంకేతికతతో నిఘా వలన అనుమానాస్పద కదలికలు, అక్రమ కార్యకలాపాలను వెంటనే గుర్తించి అడ్డుకోవచ్చని తెలిపారు.గ్రామ శివారు ప్రాంతాల్లో చట్టాన్ని ఉల్లంఘించే వారిపై తక్షణ చర్య తీసుకునేందుకు ఈ విధానం మరింత ప్రభావవంతంగా మారుతుందని వారు పేర్కొన్నారు.