కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాకినాడ జిల్లా తెలుగు నాడు వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు యల్లపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘ సభ్యులందరూ కలిసి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ని కలిసి వైద్యారోగ్య శాఖలోని క్షేత్రస్థాయిలో సిబ్బంది , ఏఎన్ఎం లు ఎఫ్ ఆర్ ఎస్ వల్ల పడుతున్న ఇబ్బందులు తెలియజేసి దాని నుంచి తప్పించవలసిందిగా కోరుచున్నాము. అని సచివాలయం లో ఏఎన్ఎం ల కు వైద్యారోగ్య శాఖ విధులు కాకుండా మిగతా శాఖ ల విధులు నుండి తప్పించవలసిందిగా కోరుచున్నాము అని తెలియజేశారు.అలాగే సెకండ్ ఏఎన్ఎం లు చాలా కాలం నుండి జీతాలు పెంచకుండానే పనిచేస్తున్నారు కాబట్టి వాళ్లకి జీతాలు పెంచవలసిందిగా కోరుచున్నాము. అని ఎమ్మెల్యే కి తెలియజేశారు. చాలా మంది ఏఎన్ఎంలు, జిఎన్ఎమ్ (స్టాఫ్ నర్స్) ట్రైనింగ్ అయ్యి ఉన్నారు .వాళ్ళకి స్టాఫ్ నర్సులుగా ప్రమోషన్ ఇప్పించవలసిందిగా కోరుచున్నాo. కావున ఈ విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిందిగా శాసనసభ్యులనుకోరి వినతిపత్రం అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వై శ్రీనివాసరావు,కార్యవర్గ సభ్యులు, కే శ్రీనివాస్ , రాజా, ప్రకాష్, వై శ్రీను, ఎస్ కే వి డి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.