Saturday, August 2, 2025
Saturday, August 2, 2025

తల్లిపాలు ఆరోగ్యానికి ఆవశ్యకం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

సిడిపిఓ పూర్ణిమ

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

తల్లి పాలు ప్రతి శిశువు ఆరోగ్యానికి అత్యంత కీలకమని సిడిపిఓ ఎం. పూర్ణిమ పేర్కొన్నారు. మండల కేంద్రమైన జగ్గంపేట మరియు మన్యంవారిపాలెం గ్రామంలో శుక్రవారం తల్లిపాలు వారోత్సవాలు ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గర్భిణీలకు, బాలింతలకు, వారి కుటుంబ సభ్యులకు తల్లి పాలను అందించడంలో ఉండే లాభాలపై అవగాహన కల్పించబడింది.ఈ కార్యక్రమంలో మాట్లాడిన సిడిపిఓ పూర్ణిమ మాట్లాడుతూ,తల్లి పాలు శిశువుకు రోగనిరోధక శక్తిని పెంచుతూ, ఇన్ఫెక్షన్లను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పాలు పీల్చడం ద్వారా తల్లిలో పాలు ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో తల్లి–బిడ్డ బంధం బలపడుతుంది. అంతేకాకుండా తల్లికి రక్తస్రావం తగ్గి, శరీర ధృఢత్వం పొందుతుంది” అని వివరించారు.ఈ వారోత్సవాల సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలలో భౌతికంగా సమావేశాలు నిర్వహించి, విజ్ఞానంపై అవగాహన కల్పించడం, తల్లి పాల పై ప్రాముఖ్యతను తెలియజేసే ర్యాలీలు, సమాచార పోస్టర్లు వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలు ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగనున్నట్లు ఆమె తెలిపారు.
.చివరిగా గ్రామంలో శిశు పోషణ పై అవగాహన కల్పించే ర్యాలీ నిర్వహించబడింది. తల్లి పాలు ఆరోగ్యానికి పునాది అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో మన్యంవారిపాలెం గ్రామ సర్పంచ్, అంగన్వాడీ సూపర్వైజర్లు అమ్మాజీ, సునీత, మహిళా ఆరోగ్య కార్మికులు ,మహిళా పోలీసులు, ఏ ఎన్ ఎం లు , ఆశ వర్కర్లు, తల్లులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo