వెంకటేశ్వర స్వామి ప్రతిమతో సత్కారం ..ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టిడిపి నేతలు అభినందనలు
జగ్గంపేట నియోజకవర్గంలో కీలకమైన పుష్కర ఎత్తిపోతల పథకం అంతర్భాగం తాళ్లూరు లిఫ్ట్ కు ప్రభుత్వం 52 కోట్లు నిధులు మంజూరు చేస్తూ క్యాబినెట్ ఆమోదం చేసి ఆ పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని ఆయన నివాసంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ, పుష్కర ప్రాజెక్టు కమిటీ చైర్మన్ అడబాల భాస్కరరావు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భారత్, గండేపల్లి మండల టిడిపి అధ్యక్షులు పోతుల మోహనరావు, అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు మారిశెట్టి భద్రం, కందుల చిట్టిబాబు తదితరులు ముఖ్యమంత్రిని ఘనంగా సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను జ్ఞాపకగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో పైపులైన్లు మరమ్మతుకు గురై మూ లనపడ్డ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు ఊపిరి పోసిపుష్కర ఎత్తిపోతల పథకం తాళ్లూరు లిఫ్ట్ కు పైపులైన్ల మార్పునకు ఆమోదముద్ర వేసి
రూ.51.67 కోట్లతో పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు, పనులు ప్రారంభించేందుకు పచ్చజెండా ఊపిన ముఖ్యమంత్రి చంద్రబాబు కు కృతజ్ఞతలు తెలియజేసేందుకు విచ్చేసామని ఈ ప్రాజెక్టు వల్ల31వేల ఎకరాల ఆయకట్టుకు రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు కు రుణపడి ఉంటారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు.