కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామానికి చెందిన రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు (కొండబాబు) తన పుట్టినరోజు పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు నా పుట్టినరోజు తో పాటు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శ్రావణ పౌర్ణమి జన్మ నక్షత్రం కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించాలని జగ్గంపేట శాసనసభ్యులు, టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారని నియోజకవర్గం లోని ప్రముఖులు టిడిపి నాయకులు సోషల్ మీడియా ద్వారా, ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు.