రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల కఠిన చర్యలు
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు త్రాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశించిన నేపథ్యంలో కిర్లంపూడి పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.ఇందులో భాగంగా, ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని, గౌరవ పత్తిపాడు కోర్టు ముందు హాజరుపరిచారు.కోర్టు విచారణలో ఒక వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష విధించగా, మిగతా ఐదుగురికి రూ.10,000 చొప్పున జరిమానా విధిస్తూ మొత్తం రూ. 50,000 జరిమానా విధించింది.ఈ సందర్భంగా సీఐ వై.ఆర్.కె శ్రీనివాస్ మాట్లాడుతూ, “ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే త్రాగి వాహనదారులపై కఠిన చర్యలు తప్పవు. ఈ రకమైన తనిఖీలు భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగుతాయి” అని హెచ్చరించారు.