బహిరంగ సభ నిర్వహిస్తే భారీ స్థాయిలో ప్రజలు వస్తారని ప్రవీణ్ పగడాల మృతి హత్యగా ప్రజలు నమ్ముతారని భయంతో బహిరంగ సభ నిర్వహించేందుకు అనుమతి నిరాకరణ – మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్;
పాస్టర్ ప్రవీణ్ పగడాల బహిరంగ సభకు అనుమతి ఇచ్చేవరకు వదిలే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ప్రవీణ్ పగడాల కేసు విషయంలో భయపడుతున్నారని అన్నారు. ప్రవీణ్ పగడాల బహిరంగ సభ కోసం ఆరుసార్లు పోలీసులకు అనుమతి కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. పోలీసులను బహిరంగ సభకు నాలుగు వారాలలో అన్ని లాంఛనాలు పూర్తిచేసి అనుమతి ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ పోలీసులు ప్రొఫార్మా సక్రంగా పూర్తి చేయలేదని,సభ ఏర్పాటు చేసే భూమి తాలూకు రికార్డులు కావాలని వివిధ కారణాల పేరుతో అనుమతి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని తెలిపారు. బహిరంగ సభ నిర్వహిస్తే భారీ స్థాయిలో ప్రజలు వస్తారని ప్రవీణ్ పగడాల మృతి హత్యగా ప్రజలు నమ్ముతారని భయంతో బహిరంగ సభ నిర్వహించేందుకు అనుమతి నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు. హైకోర్టులో కేసు విచారించేందుకు రూ 5 లక్షలు కట్టమన్నారని తెలిపారు. ప్రముఖ సువార్తికుడు కేఏ పాల్ పిటిషన్ వేసినప్పుడు రూ 5 లక్షలు కట్టాలని కోర్టు వారు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. అయితే తనకు 5 లక్షలు కట్టేందుకు ఏ విధమైన అభ్యంతరం లేనప్పటికీ ఈ కేసు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు కనుక ప్రజల నుంచి రూ 10 రూపాయలు చొప్పున పంపాలని పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. తన పిలుపుకు క్రిస్టియన్లతో పాటు హిందువులు, ముస్లింల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. 12, వేల మంది వరకు బ్యాంక్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేశారని వివరించారు. రూ 7 లక్షల,89 వేల,643 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. 78,964 మంది వరకు స్పందించి నగదు పంపించినట్లు తెలిపారు. తన వద్ద సమకూరిన నగదుకు సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజల్లో నుంచి సేకరించిన నగదును ప్రవీణ్ పగడాల బహిరంగ సభకు, కేసు వాదించే లాయర్లకు ఇతర ఖర్చులకు వినియోగించడం జరుగుతుందని తెలిపారు. ప్రవీణ్ పగడాల హత్య కేసును పోలీసులు ప్రమాదం లో మరణించినట్లు చిత్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కేసును ప్రమాదం లో మరణించినట్లుగా చిత్రీకరించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ప్రవీణ్ పగడాలను వ్యక్తిగత హననం చేసిన ప్రభుత్వం అబాసు పాలు కాకుండా ఉండేందుకు పాస్టర్లకు 7నెలల గౌరవ వేతనం చెల్లించారని తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యతో దళితుల హిందువులు, ముస్లిం మహిళలు బాధపడుతున్నారని అన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ ప్రెస్ కు విడుదల చేయలేదని అన్నారు. ప్రవీణ్ పగడాల మృతి చెందిన అనంతరం ఆయనకు సంబంధించిన ఐ పాడ్, ల్యాప్ టాప్ పోలీసులు పట్టుకుపోయారని వివరించారు. అంచనాకు మించి ఐదు లక్షల కంటే ఎక్కువ నగదు జమ చేసిన క్రైస్తవ, హిందూ లౌకికవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా నుంచి కూడా తనకు నగదు పంపించినట్లు పేర్కొన్నారు. ప్రవీణ్ పగడాల బహిరంగ సభకు అనుమతి ఇచ్చేవరకు ప్రజల్ని జాగృతం చేస్తామని అన్నారు.