జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యం లో నిర్వహణ
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కాకినాడ జిల్లా జగ్గంపేట పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రతీ మంగళవారం నిర్వహించే డొక్కా సీతమ్మ క్యాంటీన్ అన్నదాన కార్యక్రమం ఈరోజు కూడా సేవా స్పూర్తితో నిర్వహించబడింది.
జగ్గంపేట జనసేన ఇంచార్జ్ మరియు తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా రమేష్ స్వయంగా క్యాంటీన్‌ను ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు.ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది భోజనం చేయగా, రమేష్ మాట్లాడుతూ, “గత ఎన్నికల అనంతరం ఈ క్యాంటీన్‌ను ప్రారంభించి, ప్రతి మంగళవారం నిర్విరామంగా సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాధపు వీరబాబు, కురుమల్ల నాగేశ్వరరావు, గంధం శ్రీను, కనకరాజు, శ్రీమన్నారాయణ, కాయల మణికంఠ, పాలెం బాబీ, అంకం ఓం, సత్తి సోమరాజు, అడబాల వీరబాబు, ముత్యాల వెంకటరాజు, డ్రిల్ మాస్టారు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారల్